Tuesday, November 9, 2010

నిశబ్ధంగా ఉన్న నా హృదయ
శృతి లయ శబ్దాలు 
దశాబ్ధ కాలం తరువాత నీకై
గొంతు చించుకుని అరిచాయి
నా గుండె పొరలు చీల్చుకుని
నీ గుండె గూటికి చేరాలని
రెక్కలు విచ్చుకుని ఎగిసాయి 
కట్టలు తెంచుకున్న ప్రణయం
ప్రళయమై ఉప్పొంగి నీకు 
తెలియజేయాలని నా భావాలను ముంచుకొస్తుంటె
ప్రణయ హస్తమై నీలో కలుపుకుంటావో
ప్రాణ నేస్తమై నాతో కలిసి ఉంటావో 
నీ ఇష్టం ప్రాణ నేస్తమా! 

Saturday, September 4, 2010

గురు భక్తి

"  'గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః'
ఈ పదాలకు అర్ధం ఏమో గాని
గురువంటే తెలుసు దైవసమానులని.
వారు జన్మనిచ్చిన తల్లి దండ్రులైతే
మీరు జ్ఞానమిచ్చిన తల్లి దండ్రులు
కానరాని దైవలకు ప్రతిరూపాలు
అజ్ఞాన చీకటిలో వెలుగు దీపాలు
చరిత్ర చెబుతుంది మీ శక్తి కధనాలు
పవిత్ర కర్తవ్యం పట్టిన వ్యక్తికి వందనాలు.
ఏమి ఇస్తే కలుగుతుంది నాకు పుణ్యము?
ఏమి చేస్తే తీరుతుంది ఆ ఋణము?
ఎందరో మహానుభావులను తీర్చి దిద్దిన చాతుర్యం మీది
ఆ స్థానంలో ఉన్న మీకు గౌరవించే అదృష్టం నాది.
అదే నా బాధ్యతగా భావించి
మీ రోజున అందిస్తున్న నా నమస్సుమాంజలి."
                 అని
ఏ విద్యార్ధిలొ ఉంది ఇంత భావము
ఉపాధ్యాయుడంటేనే వాళ్ళకు కండకావరము
లేదు లేదు గౌరవము అనువంతనూ
పొగరెక్కి ఉంది వాళ్ళ తనువంతనూ
"వారు, ఆమె " అనే గౌరవ సంబోధనలు మాని
"వాడు, అది " అనే అపశ్రుతులు పలుకుతుంది నేటి విద్యార్ధి లోకం.
విద్య ముగిసాక గుర్తించాల్సిన మిమ్ము
మీరే మమ్ము గుర్తించాల్సిన దరిద్ర స్థితి నేడు.
ఇంత దుస్థితికి దిగాజరినందుకు సిగ్గుపడనా?
గురువుని గౌరవించని సమాజంలో విద్యర్దినైనందుకు చింతించనా ?
భవిష్యత్తుని తొంగి చూస్తేనే భయమేస్తుంది
రాబోవు తరాలు విద్యార్ధులను తలచుకుంటేనే వణుకొస్తుంది
దయవుంచి చూపొద్దు మీరు కూడా ఏ బేధాలు
అవి ప్రధానమై మారి తెస్తున్నాయి ఈ భావనలు.
నిష్కల్మషంగా నిర్వహించండి మీ గురు కార్యము
లేకుంటే కావచ్చు ఈ పాటి గుర్తింపు కూడా శూన్యము
ఇదే నేటి మీ విద్యార్ధిగా ఒక విన్నపము
ఈనాటి నా విద్యార్ధి లోకంపై నాకున్న సద్భావము.

Sunday, August 22, 2010

మంచి ముత్యం 2

కాళ్ళు ఎప్పుడూ నేల మీదే ఉండాలి
కళ్ళు ఎప్పుడూ వాటినే చూడాలి
జయం వహిస్తే తొనకరాదు
అపజయం ఆవహిస్తే వనకరాదు
అవి అసాస్వతం
నువు ఎంత వాడివైననూ
అణిగి ఉంటె నిన్ను అనిచేవాడెవడు?

మంచి ముత్యం

కుమ్మరి చేతికి చిక్కాల్సిన మట్టి ముద్ద
చాకలి చేతికి చిక్కితే వట్టి బురదే
అవును గాని మట్టి పిడతగా మారునా?
కంసాలికివ్వాల్సిన రత్నాన్ని పిచ్చివాడికిస్తే
అది గులకరాయిగా దోర్లునుగాని
వజ్రమై పుత్తడి పొత్తిలో పొదిగి ఉండునా?
మరి నువు ఎవరి చేతికి చిక్కావ్?

ఇటు మూడు - అటు ఆరు

మనదనుకున్న మనది మనతో వచ్చునా?
వలదనుకున్నది వచ్చి తీసుకుపొవటం మరచునా?
మనది కాదనుకున్న మన్నేగా  చివరికి మనమయ్యేది!
మరి ఎందుకు ఈ జీవన గమనంలో స్వార్ధ ప్రయాసలకై జపించటం?
క్షణకాలంలో క్షయించే ఉదానమును అవి పెంచగలవా
లేక సమీపించే తుది గడియలను మన నుంచి తుంచగలవా
ఎవరికైనా చివరకు మిగిలేది
......"ఇటు మూడు - అటు ఆరే కదా!" 
కూడలి: తెలుగు బ్లాగుల సమాహారం